Apr 02,2023 01:02
విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేసిన సమితి ప్రతినిధులు

ప్రజాశక్తి-చీరాల: విద్యార్థులు ఉన్నతమైన విద్యతో ముందుకు సాగడం వలన జీవితంలో ఉన్నత విజయాలు సాధిస్తారని నేతాజీ సేవాసమితి ప్రతినిధులు పేర్కొన్నారు. శనివారం పేరాల ఏఆర్‌ఎం ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సాల్మన్‌రాజు అధ్వర్యంలో జరిగిన సమావేశంలో 2021-22 పదో తరగతి మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహం అందించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ వివిధ రకాల ప్రోత్సాహకాల సాయంతో విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యపై దృష్టి సారించాలన్నారు. అనంతరం సమితి అధ్యక్షులు మరియు పాఠశాల పూర్వ విద్యార్థి చుండూరి కృష్ణమూర్తిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేంద్ర ప్రసాద్‌, గాంధీ, చంద్రశేఖర్‌, పవని భానుచంద్రమూర్తి, సమితి ప్రతినిధులు అలమూరి నాగేశ్వరరావు, మణిబాబు, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.