- ఆర్‌జియుకెటి ఛాన్సలర్ కె.సి రెడ్డి
ప్రజాశక్తి - ఎచ్చెర్ల: బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆర్‌జియుకెటి ఛాన్సలర్ కె.సి రెడ్డి అన్నారు. మండలంలోని ఎస్‌ఎంపురంలో గల ట్రిపుల్ ఐటిలో కౌన్సెలింగ్ ప్రక్రియను సోమవారం ప్రారంభించారు. తొలిరోజు 540 మంది విద్యార్థులకు గానూ 453 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 30 స్టాల్స్‌ను ఏర్పాటు చేయగా, వంద మంది బోధన, బోధనేతర సిబ్బంది ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. తొలి 25 మంది విద్యార్థులకు ఆయన నియామక పత్రాలను అందజేశారు. అనంతరం రూ.4.20 కోట్ల అంచనా వ్యయంతో సిబ్బంది వసతి నిర్మాణ భవన పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ట్రిపుల్ డైరెక్టర్ పెద్దాడ జగదీశ్వరరావు, ఒఎస్‌డి ఎల్.డి సుధాకర్‌బాబు, పరిపాలన అధికారి మునిరామకృష్ణ, డీన్ మోహన్‌కృష్ణ, కౌన్సెలింగ్ కన్వీనర్ ఎస్.ఎస్‌వి. గోపాలరాజు, కౌన్సెలింగ్ కోఆర్డినేటర్ పి.గోవర్థనరావు ఫైనాన్స్ ఆఫీసర్ ఆసిరినాయుడు తదితరులు పాల్గొన్నారు.










