Aug 17,2023 22:59

విద్యార్థులతో మాట్లాడుతున్న ఛాన్సలర్‌ కె.సి రెడ్డి

* ఆర్‌జియుకెటి ఛాన్సలర్‌ కె.సి రెడ్డి
ప్రజాశక్తి - ఎచ్చెర్ల: 
ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహిచాలని, నైపుణ్యాధారిత విద్యపై దృష్టిసారించాలని ఆర్‌జియుకెటి ఛాన్సలర్‌ కె.సి రెడ్డి అన్నారు. ఎచ్చెర్ల ట్రిపుల్‌ ఐటిని గురువారం సందర్శించిన ఆయన పియుసి-1లో చేరిన విద్యార్థులతో మాట్లాడారు. ట్రిపుల్‌ ఐటిలో చదువుకునేందుకు ఎంపికైన విద్యార్థులంతా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వారేనని, కష్టపడి చదవడం, తెలుసుకోవాలన్న ఆసక్తిని పెంచుకోవడం, ఎటువంటి అనుమానాన్ని అయినా నివృత్తి చేసుకునేందుకు తరచూ అధ్యాపకులు, తోటి విద్యార్థులతో చర్చించడం అలవరుచుకోవాలన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్‌ జగదీశ్వరరావు, ఒఎస్‌డి సుధాకర్‌బాబు, పరిపాలన అధికారి మునిరామకృష్న, డీన్‌ మోహన్‌కృష్ణ చౌదరి, ఫైనాన్స్‌ ఆఫీసర్‌ చల్లా అసిరినాయుడు, గేదెల రవి తదితరులు పాల్గొన్నారు.