Jul 10,2023 01:11
విద్యార్థులకు నగదు బహుమతిని అందించే చెక్కు నమూనా అందిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-పంగులూరు: విద్యోన్నతి ఫౌండేషన్‌ ద్వారా 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన పరీక్షలో అత్యున్నత ప్రతిభ ఘనపరిచిన 15 మందికి ఆదివారం నగదు బహుమతిని అందజేశారు. ఇంకొల్లు మండలం గంగవరం గ్రామంలో గల మంచాల వెంకట రామయ్య రంగమ్మ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున, మెరిట్‌ సర్టిఫికెట్లను కూడా అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్‌ డైరెక్టర్‌ దూళిపాళ్ల వీరనారాయణ మాట్లాడుతూ ధూళిపాళ్ల వెంకటేశ్వర్లు బోడెంపూడి రామమూర్తి జ్ఞాపకార్థం విద్యోన్నతి ఫౌండేషన్‌ ద్వారా ఈ స్కాలర్షిప్‌ అందిస్తున్నట్లు చెప్పారు. గత విద్యా సంవత్సరం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఫౌండేషన్‌ ద్వారా పరీక్షలు నిర్వహించామని, పంగులూరు, అద్దంకి, ఇంకొల్లు మండలాల్లోని విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి వారిలో ఒక్కొక్క మండలానికి ఐదుగురు విద్యార్థులు చొప్పున అత్యంత ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసామని చెప్పారు. అద్దంకి మండలం తిమ్మాయిపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల నుంచి నలుగురు విద్యార్థులు, చందలూరు, బూడవాడ, పావులూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల నుంచి ఇద్దరు విద్యార్థులు చొప్పున, దుద్దుకూరు, ఇంకొల్లు, అద్దంకి ప్రకాశం బాలురు పాఠశాల, పిఎస్‌ఎన్సిసిహెచ్‌ఎస్‌ ముప్పవరం, ఎస్వీకే హెచ్‌ఎస్‌ గంగవరం, పాఠశాలల నుంచి ఒక్కొక్క విద్యార్థి ఎంపికైనట్లు వీరనారాయణ చెప్పారు. ఈ విద్యార్థు లు 10వ తరగతి పూర్తయి ఇంటర్మీడియట్‌ చర్చమాన చదువుల కోసం ఈ స్కాలర్షిప్‌లు ఇస్తున్నట్లు వీరనారాయణ చెప్పారు. అనంతరం విద్యార్థులకు పదివేల రూపాయలు చొప్పున నగదు అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్‌ నాయకులు వై సిద్దయ్య, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వలేటి కృష్ణయ్య, డాక్టర్‌ రమేష్‌కుమార్‌, ప్రధానో పాధ్యాయులు వీరాంజనేయులు, సోమేపల్లి రామ్మోహన్రావు, బోడెంపూడి జయశ్రీ, జయ శంకర్‌, ఉపాధ్యాయుడు సుబ్బారావు, రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.