Dec 27,2022 00:02

ఎమ్మెల్యేలు ధర్మశ్రీ,

ప్రజాశక్తి-రావికమతం:మారుతున్న రోజులు కనుగుణంగా సిఎం జగన్‌ విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారని ప్రభుత్వ విప్‌, చోడవరం శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ అన్నారు మండలంలో ఐసిడిఎస్‌ కార్యాలయంలో సోమవారం మండల విద్యాశాఖ ఏర్పాటు చేసిన జగనన్న సాంకేతిక చేయూత కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, 16 వేలు విలువచేసే ట్యాబును బైజుస్‌ కంపెనీ తో ఒప్పందం కుదుర్చుకొని ఒక్కొక్క ట్యాబ్‌ ని 13 వేలకు తీసుకొని విద్యార్థులకు అందజేయడం జరుగుతుందన్నారు. అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ముందుండాలన్న లక్ష్యంతో జగన్మోహన్‌ రెడ్డి పని చేస్తున్నారని ఆయన తెలిపారు. రావికమతం మండలంలో చదువుతున్న 773 మంది ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబులు అదేవిధంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. గుణాత్మకమైన విద్యను అందించే దిశగా పని చేయడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులకు గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, అమ్మ ఒడి, వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ, సాంకేతిక చేయూత, జగన్‌ విద్యా వసతి, విద్యా దీవెన వంటి పథకాలు అమలు చేస్తున్నారన్నారు. విద్యార్థులు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పైలరాజు, కోలా వైసిపి నాయకులు కోల గురువులు, ఎంపిడిఓ వెంకన్నబాబు, ఎంఈఓ విజయలక్ష్మి, సర్పంచులు, ఎంపీటీసీలు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్లు పాల్గొన్నారు.
ఎస్‌.రాయవరం:డిజిటల్‌ విద్యతో అత్యున్నతస్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఆకాంక్షించారు. కొరుప్రొలు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఎనిమిదవ తరగతి విద్యార్ధులకు ట్యాబ్‌లు అందచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సులభమైన పద్దతుల్లో సాధారణ విద్యార్ధులకు కూడా అర్ధమయ్యే రీతిలో పాఠాలు బోధించవచ్చన్నారు. ట్యాబ్‌లను సక్రమంగా వినియోగించుకుని అత్యుత్తమ ఫలితాలు సాధించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో మూర్తి, ప్రధానోపాధ్యాయుడు పురుషోత్తమరావు, నాయకులు చేకూరి రామురాజు, మాతా గుర్నాధరావు, చంటి పాల్గొన్నారు.