కరస్పాండెంట్ జివి.సత్యనారాయణరాజు
ప్రజాశక్తి - కలిదిండి
విద్యలో అగ్రగామిగా శశి (ఇంగ్లీష్ మీడియం) హైస్కూల్ మండల స్థాయిలో పేరొందిందని కరస్పాండెంట్ జివి.సత్యనారాయణరాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజాశక్తితో మాట్లాడుతూ కోరుకొల్లు రోడ్డులో ప్రభుత్వ జూనియర్ కళాశాల దాటిన తర్వాత వే బ్రిడ్జి వద్ద సువిశాల ప్రాంతంలో శశి హైస్కూల్ నెలకొల్పినట్లు చెప్పారు. గత పదేళ్ల నుంచి మండల స్థాయిలో విద్యాభివృద్ధిలో ముందుకు సాగుతోందన్నారు. నేషనల్, ఇంటర్‌నేషనల్ స్థాయిలో కరాటేలో వివిధ పతకాలు సొంతం చేసుకున్న ఘనత శశి హైస్కూల్ విద్యా ర్థులదేనన్నారు. స్థాపించిన నాటి నుంచి నేటి వరకు పదో తరగతిలో ప్రతి ఏటా తమ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారన్నారు. గతేడాది తమ విద్యార్థి కె.స్రవంతి 587/600 మార్కులు సాధించడం శశి హైస్కూల్ ప్రతిభకు నిదర్శనమన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం మండలంలోని అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో సువిశాల ఆట మైదానంతో విద్యార్థుల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా అనుభవం, అంకితభావం కలిగిన ఉపాధ్యాయులతో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. చదువులో వెనుక బడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక చొరవ చూపుతున్నామన్నారు. తరగతుల వారీగా గదుల కేటాయింపుతో విద్యార్థి ప్రశాంతంగా విద్య అభ్యసించడంలో పాఠశాల ఆవరణ దోహదపడుతుందన్నారు. ఆ రీతిలో తరగతి గదులను తీర్చిదిద్దామన్నారు. విద్యతో పాటు విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహిస్తామని చెప్పారు. ఈ ఏడాది విడుదలైన ఫలితాల్లోనూ తమ విద్యార్థులు సత్తా చాటారన్నారు. రుద్రపాక వసంతశ్రీ 584 మార్కులతో మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. విద్యాభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్న శశి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో విద్యార్థులను చేర్పించి, విద్యార్థుల భవిష్యత్తుకు ఉజ్వల బాటలు వేయాలని కరస్పాండెంట్ జివి.సత్యనారాయణరాజు కోరారు.










