ప్రజాశక్తి-సామర్లకోట రూరల్, కరప రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యకు వైసిపి ప్రభుత్వం, సిఎం జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు అన్నారు. ఉండూరు జెడ్‌పి ఉన్నత పాఠశాలలో అమ్మఒడి పథకం పంపిణీ కార్యక్రమంలో దొరబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అమ్మఒడి పథకం ద్వారా తల్లుల ఖాతాల్లో నేరుగా డబ్బులు వేశారన్నారు. దానిద్వారా పిల్లల చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదని తలుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి బొబ్బరాడ సత్తిబాబు, గ్రామ సర్పంచ్ ధనలక్ష్మి, ఉపసర్పంచి కొప్పిరెడ్డి రాధాకృష్ణ, వైసిపి మండల అధ్యక్షుడు తాటికొండ బాబ్జి, వైసిపి నాయకుడు ఎలిశెట్టి నరేష్, ఎంఇఒలు శివరామకృష్ణయ్య, పుల్లయ్య హెచ్‌ఎం యామినా మాధురి పాల్గొన్నారు.
కరప మండలానికి అమ్మఒడి నిధులు మంజూరయ్యాయని ఎంఇఒ కృష్ణవేణి తెలిపారు. స్థానిక చిరంజీవి కళ్యాణ మండపంలో తల్లుల కమిటీతో నిర్వహించిన సమా వేశంలో ఎంపిపి పెంకే శ్రీలక్ష్మి సత్తిబాబు, జెడ్‌పిటిసి వై. సుబ్బారావు పాల్గొని ప్రసంగించారు. సుబ్బా రావు మాట్లాడుతూ విద్యా విధానంలో సిఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి, నాడు-నేడు ద్వారా నిధులు మంజూరు చేసి స్కూల్ అభివద్ధికి మొదట ప్రాధాన్యత ఇచ్చారని సుబ్బారావు తెలిపారు. గ్రామ సర్పంచ్ సాగే ఆశాజ్యోతి కుమార్, ప్రధానోపాధ్యాయులు లీల మనోహర్, విద్యా కమిటీ చైర్మన్ రమాదేవి, వైస్ సర్పంచ్ సూర్యనారాయణ, రాయుడు శ్రీను పాల్గొన్నారు.










