ప్రజాశక్తి-హుకుంపేట:విద్యాభివృద్ధి ప్రభుత్వం కృషి చేస్తుందని అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ తెలిపారు. మండలంలోని స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలురు 1లో సమావేశంను మండల విద్యాశాఖ అధికారి ఎస్ రామసుందర్రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యార్థులకు ట్యాబులను ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నాడు నేడు ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేస్తుందన్నారు. మండలంలో 787 మంది విద్యార్థులకు గాను 60 ట్యాబులను పంపిణీ చేశామని, మిగతా వాటిని ఆయా పాఠశాలలకు అందజేస్తామన్నారు.విద్యా వ్యవస్థను మెరుగు పరచాలనే ఉద్దేశంతో విద్యార్థులకు చాలా రకాలుగా పథకాలు ప్రభుత్వం ప్రవేశ పెడుతుందన్నారు.విద్యార్థులు చదువుపై దృష్టి సారించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో ఏజెన్సీ ప్రాంతానికి ఎంతో మేలు జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టి కమిషన్ సభ్యురాలు జంపరింగి లిల్లీ, ఎంపీపీ కూడా రాజబాబు, జెడ్పిటిసి రేగం మత్యలింగం, ఎంపీడీవో ఆర్.వెంకటరమణ, ఎంఈఓ ఎస్.రామచంద్రరావు, స్థానిక పాఠశాల ప్రధానో పాధ్యాయులు రాంబాబు, సర్పంచులు, వైసిపి నేతలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.










