Jun 28,2023 21:08

చెక్కు అందజేస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌

రాయచోటి : మనిషి తలరాతను మార్చడానికి ఒక చదువుకు మాత్రమే సాధ్యమవుతుందని తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌ సభాభావన్‌లో ''జగనన్న అమ్మఒడి'' పథకం 4వ విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదు వుకు పేదరికం ఎప్పుడూ ఆటంకం కాకూడదన్న గొప్ప ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అమ్మఒడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వరుసగా నాలుగో ఏడాది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేశారన్నారు. జిల్లా వ్యాప్తంగా అర్హత కలిగిన తల్లులకు ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున 1,52,366 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలో రూ.225.55 కోట్ల రూపాయల మొత్తాన్ని నేరుగా జమ చేశారన్నారు. చదువు ఉంటే ఎక్కడైనా రాణించగలరని తల్లిదండ్రులు అందరూ కూడా తమ పిల్లలను బాగా చదివించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలను అన్ని రకాల మౌలిక వసతులతో కార్పొరేట్‌ తరహాలో తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. విదేశీ విద్య కార్యక్రమం ద్వారా ఇతర దేశాలకు వెళ్లి చదువుకోవడానికి కూడా ప్రభుత్వం సహకరిస్తుందని తల్లిదండ్రులందరూ ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ రోజుల్లో కార్పొరేట్‌ పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియం చదివించాలంటే ఎక్కువ డబ్బులు ఖర్చవుతాయని వీటన్నింటి దష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియం తీసుకొచ్చారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఇంగ్లీషులో చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద ఎత్తున విద్యకు ప్రాధాన్యత ఇవ్వలేదని, విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే అన్నారు. జగనన్న విద్యా కానుక, జగనన్న వసతి దీవెన, వంటి అనేక పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఇలాంటి మంచి పథకాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా అర్హత కలిగిన తల్లులకు ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున 1,52,366 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలో రూ.228,54,90,000 మొత్తాన్నికి సంబంధించి మెగా చెక్కును విద్యార్థుల తల్లులకు ముఖ్య అతిథులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు నిర్వహించిన సాంస్కతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌ భాష, డిఇఒ పురుషోత్తం, డిప్యూటీ డిఇఒ వరలక్ష్మి, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు