Jul 25,2023 21:35

ప్రజాశక్తి - కాళ్ల
              ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అనేక సౌకర్యాలు కల్పిస్తుందని ఎంఇఒ-2 గాదిరాజు కనకరాజు అన్నారు. ఏలూరుపాడు హైస్కూల్లో స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కనకరాజు మాట్లాడుతూ విద్యార్థులు రీడింగ్‌, రైటింగ్‌లో నైపుణ్యం పెంపొందించేందుకు ఉపాధ్యాయులు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై సూచనలు ఇచ్చారు. ఈ సమావేశంలో స్కూల్‌ కాంప్లెక్స్‌ కన్వీనర్‌ పిఎస్‌.రామకృష్ణ, ఏలూరుపాడు హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు గొట్టుముక్కల వెంకట సత్యనా రాయణరాజు, పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.