Aug 17,2023 20:32

ఇండోర్‌ స్టేడియాన్ని ప్రారంభిస్తున్న మంత్రి

ప్రజాశక్తి-నెల్లూరు :విద్యకు పేదరికం అడ్డుకాకూడదని, విద్య ద్వారా వెనుకబాటుతనాన్ని రూపుమాపవచ్చుని భావించి విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికే దక్కిందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు.గురువారం నగరంలోని నవాబుపేట బివిఎస్‌ బాలికల మున్సిపల్‌ హైస్కూల్లో రూ.2.09 కోట్లతో నిర్మించిన షటిల్‌ బ్యాడ్మింటన్‌ ఇండోర్‌ స్టేడియం, బాస్కెట్‌బాల్‌, కోర్టు, కాంపౌండ్‌ వాల్‌ను నగర శాసనసభ్యులు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తో కలిసి మంత్రి ప్రారంభించారు. నగరంలో పలు ప్రాంతాల్లో సిమెంట్‌ రోడ్లు, కాలువలు, పైపులైన్ల అభివద్ధి పనులకు రూ. 6.27 కోట్లతో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ఘనత ముఖ్యమంత్రిదేనన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ముఖ్యమంత్రి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. నగర అభివద్ధికి ఎంఎల్‌ఎ అనిల్‌ కుమార్‌ ఎంతో కషి చేస్తున్నారన్నారు. ప్రణాళికాబద్ధంగా నగరంలో అభివద్ధి పనులపై శ్రద్ధ పెట్టారన్నారు.
బివిఎస్‌ పాఠశాల రూపు రేఖలు మారాయి..
రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా బివిఎస్‌ పాఠశాలలో షటిల్‌ బ్యాడ్మింటన్‌ ఇండోర్‌ స్టేడియం, బాస్కెట్బాల్‌ కోర్టును 2.09 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేవామని నగర శాసనసభ్యులు అనిల్‌ కుమార్‌ పేర్కొన్నారు. త్వరలోనే ఆర్‌ ఎస్‌ ఆర్‌ హైస్కూల్లో కూడా ఫుట్బాల్‌ కోర్ట్‌ ను ఏర్పాటు చేసేందుకు కషి చేస్తున్నట్లు చెప్పారు. గతంలో నగరంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కలిపి రూ. 2.50 కోట్ల మేర అభివద్ధి పనులు చేపడితే, తమ ప్రభుత్వ హయాంలో ఒక్క బీవీఎస్‌ పాఠశాలలోనే సుమారు ఐదు కోట్లతో అభివద్ధి పనులు చేపట్టామన్నారు. కమిషనర్‌ వికాస్‌, ఆప్కాఫ్‌ చైర్మన్‌ అనిల్‌ బాబు, డిఇఒ గంగాభవాని, డిప్యూటీ కమిషనర్‌ చెన్నుడు, 7వ డివిజన్‌ కార్పొరేటర్‌ కిన్నెర మాల్యాద్రి ఉన్నారు.