Dec 14,2022 00:12

ప్లేస్‌మెంట్‌ సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులను సత్కరిస్తున్న రామ్‌కుమార్‌రెడ్డి

ప్రజాశక్తి-అనకాపల్లి
విద్యా సంస్థల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి కృషి చేస్తున్నారని ఎపి కమ్యూనిటీ డెవలప్మెంట్‌ బోర్డు చైర్మన్‌ నేదురుమల్లి రామ్‌ కుమార్‌ అన్నారు. స్థానిక డైట్‌ ఇంజనీరింగ్‌ కళాశాల వార్షికోత్సవంలో భాగంగా వైబ్రంట్‌ డైట్‌ 2022 రెండవ రోజు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు వాలంటీర్‌ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ జనరల్‌ మేనేజర్‌ కెవి రావు మాట్లాడుతూ అన్ని రంగాలు ఇంజనీరింగ్‌ విద్యతో ముడిపడి ఉన్నందున ఇందులో రాణిస్తే జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చని తెలిపారు. టెక్‌ మహీంద్రా డెలివరీ హెడ్‌ రవిచంద్ర ఇంజనీరింగ్‌ విద్య ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ప్లేస్మెంట్‌ సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులకు, మెరిట్‌ విద్యార్థులకు సిల్వర్‌ మెడల్స్‌ అందించారు. అనంతరం ముఖ్య అతిథులను చైర్మన్‌ దాడి రత్నాకర్‌ సత్కరించారు. విద్యార్థుల నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొణతాల నీలిమ భాస్కరరావు, పీలా లక్ష్మి సౌజన్య రాంబాబు, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ చెల్లా నరసింహం, వైస్‌ ప్రిన్సిపాల్‌ వైకుంఠ రావు, అడ్మినిస్ట్రేషన్‌ డీన్‌ డాక్టర్‌ కెఎస్‌ ఈశ్వరరావు, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, పాల్గొన్నారు.