
ప్రజాశక్తి-యంత్రాంగం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయాలని, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని డిమాండ్‌చేస్తూ విద్యార్థి యువజన సంఘాలు బుధవారం పిలుపునిచ్చిన విద్యాసంస్థల బంద్ జిల్లా వ్యాప్తంగా విజయవంతమైంది.
కాకినాడ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కరణ ఆపాలని అలాగే కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కాకినాడలో బంద్ సంపూర్ణంగా జరిగింది. ఎఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి, వై.బాబి, ఎస్‌ఎఫ్‌ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి, ఎం.గంగా సూరిబాబు, పిడిఎస్‌యు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, సిద్ధు, విద్యార్థి జెఎసి రాష్ట్ర నాయకులు బుల్లి రాజు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలన్నారు. విశాఖలో అక్కడి కార్మికులు దీక్షలు చేపట్టి 1000 రోజులు అయిన సందర్భంగా వారికి సంఘీభావం తెలియజేస్తూ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నవంబర్ 8న బంద్‌కు పిలుపునిచ్చారు. దీనికి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు సంపూర్ణంగా బంద్ ఇచ్చారు. అలాగే విద్యార్థులు తల్లిదండ్రులు కూడా దీనికి మద్దతు తెలియజేశారు. వీరికి విద్యార్థి యువజన సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అలాగే కేంద్రం ఇప్పటికైనా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కరణ ఆపి కడప ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు కేటాయించాలని అన్నారు. లేకుంటే విద్యార్థి యువజన సంఘాలు ఆధ్వర్యంలో మరిన్ని ఉద్యమాలు చేపడతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దోబూచులు ఆడకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కరణ పై ఒక నిర్ణయానికి రావాలని అన్నారు.కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ కాకినాడ నగర కార్యదర్శి వాసుదేవ్ నగర నాయకులు జయరాం, ఆదర్శ్, రోహిత్, రాజేష్, అభిషేక్, సాహిత్ అమత, విద్యా గిరీష, సిద్ధు, పావని వర్ణిక, అనుష, కప ఎఐవైఎఫ్ నాయకులు గోనెల నాగభూషణం, నాని సూరంపూడి, సిహెచ్.అశోక్, ఎమ్. వీరబాబు, ప్రకాష్, కుర దాసు చిన్న, కె.అజరు, పి.మధు, విద్యార్థి జెఎసి నాయకులు మురళి సాయిలు పాల్గొన్నారు. సామర్లకోట రూరల్ ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్రవ్యాప్త బంధు పిలుపులో భాగంగా బుధవారం పట్టణంలో చేపట్టిన విద్యా సంస్ధల బందు విజయవంతమైంది. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లాకమిటి సభ్యులు ఎ.శివ , పట్టణ నాయకులు కె.వినరు లు మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. పట్టణంలోని పలు పాఠశాలలు బంద్ నిర్వహించారు. కార్యక్రమంలో బాలం ప్రవీణ్, పసుపులేటి ధనుష్,వీరబాబు, శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.రౌతులపూడి రాష్ట్ర కేంద్రం పిలుపుమేరకు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలను మూసి వేయించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు పి.వరహాలు పాల్గొని ప్రసంగించారు ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి సంపూర్ణ మద్దతు లభించిందన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కిరణ్. సతీష్. వీరబాబు, శివ, దివాకర్ మరియు విద్యార్థులు బంద్‌లో పాల్గొన్నారు. పిఠాపురం విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కరణ ఆపాలని, కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ ఎఫ్ ఐ) జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, ఎఐవైఎఫ్ కాకినాడ జిల్లా నాయకులు కిరణ్ లు అన్నారు. విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన బంద్‌కు ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు సెలవు ప్రకటించి బంద్‌కు సహకరించారన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ పిఠాపురం అధ్యక్షులు బి వెంకటేష్, నాయకులు సిహెచ్ లోవరాజు, చిన్ని అయ్యప్ప, నాని, రాజేష్, ప్రకేష్, కష్ణ, సంతోష్, మురళిలు పాల్గొన్నారు.ఏలేశ్వరరం విద్యార్థుల సమస్యలతో పాటు వారి భవిష్యత్తు సమస్యలు పరిష్కారం కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ పిలుపుమేరకునియోజకవర్గంలో బంద్ విజయవం తమైంది. బంద్‌లో భాగంగా ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు మూసివేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నియోజకవర్గ నాయకుడు చవ్వాకుల నరసింహమూర్తి, సిఐటియు మండల కార్యదర్శి రొంగల ఈశ్వర రావు మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నరసింహమూర్తి, శ్రీరామ్, వినరు, మనోహర్, చంటిబాబు, సంతోష్, పవన్ సంతోష్ ఉన్నారు.