ఫొటో : విద్యార్థులకు సామగ్రిని అందజేస్తున్న హెచ్‌ఎం సుబ్బారెడ్డి
విద్యాసామగ్రి పంపిణీ
ప్రజాశక్తి-ఉదయగిరి : సొంత నిధులతో ప్రధానోపాధ్యాయులు గాజులపల్లి సుబ్బారెడ్డి విద్యార్థులకు ఉపయోగపడే వస్తు సామాగ్రి పంపిణీ చేశారు. మంగళవారం మండల పరిధిలోని పుల్లాయపల్లి ఎంపియుపిఎస్ ప్రధానోపాధ్యాయులు గాజులపల్లి సుబ్బారెడ్డి తన పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు ప్రతి సబ్జెక్టుకి ఒక నోట్బుక్ రెడ్ బ్లూ పెన్ పెన్సిల్ షాప్నర్ అరైసర్ కిట్లు అందజేశారు. విద్యార్థి తల్లి దండ్రులు గ్రామస్తులు అయనను అభినందించారు. కార్యక్రమంలో సహౌపాధ్యాయులు ఆదిలక్ష్మిదేవి, ప్రశాంతి కుమారి, పాఠశాల చైర్మన్ ఏసుదాసు, తల్లిదండ్రుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.










