ఫొటో : విద్యార్థులకు విద్యాసామగ్రి పంపిణీ చేస్తున్న వైసిపి నేత
విద్యాసామగ్రి పంపిణీ
ప్రజాశక్తి-మర్రిపాడు : స్థానిక ప్రభుత్వ బాలుర, బాలికల, కంపసముద్రం బాలుర వసతి గృహాలలోని విద్యార్థులకు ప్రభుత్వం అందజేసిన విద్యా సామగ్రిని, ఆట వస్తువులను వైసిపి మండల మాజీ కన్వీనర్ గంగవరపు శ్రీనివాసులు నాయుడు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి విద్యాభివృద్ధి కోసం పాటుపడుతూ నాడు-నేడు పథకం కింద పాఠశాలల రూపు రేఖలను మార్చి విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించి, విద్యాకానుక కిట్లను ప్రతి ఏడాది అందిస్తున్నారని వివరించారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సంక్షేమాధికారులు అంకయ్య, సూర్యకుమారి, మహమ్మద్ అలీ పాల్గొన్నారు.










