Sep 15,2023 00:39

ప్రజాశక్తి - సంతమాగులూరు
స్థానిక ఎంఆర్‌సి భవనంలో ఎంఇఒ2గా బాధ్యతలు చేపట్టిన దార్ల దినేష్‌ను ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సమైక్య వేదిక సభ్యులు ఘనంగా సన్మానించారు. దార్ల దినేష్ త్రిపురాంతకం మండలంలో హెచ్‌ఎంగా పనిచేస్తూ పదోన్నతిపై ఎంఈఓగా వచ్చారు. ఎంఈఓ1గా పని చేస్తున్న వేమవరపు కోటేశ్వరావును సన్మానించారు. కార్యక్రమంలో ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు, అద్దంకి బిఎస్‌పి కన్వీనర్ మందా జోసెఫ్, ఎర్రమోతు శంకరరావు, జ్యోతి డేవిడ్ పాల్గొన్నారు.