ప్రజాశక్తి - నూజివీడు రూరల్
విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ప్రధానోపాధ్యాయిని రాధికా రాణి తెలిపారు. మండలంలోని గొల్లపల్లి గ్రామం అందే రామకృష్ణయ్య జిల్లా పరిషత్ హైస్కూల్‌లో శనివారం విద్యార్థులకు రాబోవు పరీక్షలను ఎదుర్కొనేందుకు అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. గత సంవత్సరం పిఎం 10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల్లో మనోధైర్యం, ఆత్మ విశ్వాసంతో అత్యధిక మార్కులు సాధించడానికి సూచనలు జారీ చేశారు. పరీక్ష పే చర్చలో పాల్గొన్న 29 మంది విద్యార్థులకు పిఎం నుంచి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవీంద్ర, కృష్ణవేణి, మోహన రావు, రంగారావు, బాలు, విఠల్ బాబు, రాంబాబు పాల్గొన్నారు.










