Dec 29,2022 21:40

ప్రజాశక్తి - ముసునూరు
           ప్రతి విద్యార్థి పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించి ట్రిపుల్‌ ఐటి సీటు సాధించాలని నూజివీడు నియోజకవర్గ ఎంఎల్‌ఎ మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు అన్నారు. మండల కేంద్రమైన ముసునూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఎంపిడిఒ జి.రాణి, ప్రధానోపాధ్యాయులు ఎం.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఎనిమిదో తరగతి విద్యార్థులకు గురువారం ట్యాబ్‌లు అందించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాల అధిరోహించాలని ఆకాంక్షిచారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు వరికూటి ప్రతాప్‌, ఎంపిపి రాపర్ల కృష్ణకుమారి సుబ్బారావు, కోటగిరి రాజానాయన, సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, వైసిపి మండల అధ్యక్షులు ఎం.నాగవల్లేశ్వరరావు, తహశీల్దార్‌ దాసరి సుధ పాల్గొన్నారు.
చాట్రాయి : చాట్రాయి మండల ప్రజా పరిషత్‌ అభివృద్ధి కార్యాలయం వద్ద ఎనిమిదో తరగతి విద్యార్థులకు మొత్తం 424 ట్యాబ్‌లను గురువారం ఎంఎల్‌ఎ మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కో-ఆపరేటివ్‌ యూనియన్‌ ఛైర్మన్‌ దేశిరెడ్డి రాఘవరెడ్డి, ఎంపిడిఒ ఎన్‌.మురళీమోహన్‌, తహశీల్దార్‌ సిహెచ్‌.విశ్వనాధరావు, ఎంపిపి లంక నిర్మల, గ్రామ సర్పంచి దామెర ఉష, ఎంపిటిసి సభ్యులు సంకు శివకుమారి, దామెర ప్రసాద్‌బాబు, డివైఇఒ సిరియా నాయక్‌, ఎంఇఒ డి.వెంకటేశ్వర్లు, ఇఒపిఆర్‌డి నాగరాజు పాల్గొన్నారు.
ముదినేపల్లి : మండలంలోని వడాలి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎంఎల్‌ఎ డిఎన్‌ఆర్‌ ఆదేశాలు మేరకు గురువారం ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఈ వడాలి వైసిపి నాయకులు మరీదు హనుమంతు, కార్యక్రమంలో ఎంపిటిసి సభ్యులు పల్లి శ్రీదేవి, స్కూల్‌ ఛైర్మన్‌ పల్లి ఉమామహేశ్వరి, భూలోకరెడ్డి స్కూల్‌ హెచ్‌ఎం నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
దెందులూరు : మండలంలోని కొవ్వలి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థులకు గురువారం ఎంఇఒ సిహెచ్‌.బుధవాస్‌ ట్యాబ్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ట్యాబ్‌లను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శర్మ, స్థానిక సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు పాల్గొన్నారు.