
ప్రజాశక్తి - ఉండి
విద్యార్థులు పుస్తక పఠనంతోనే విజ్ఞానవంతులుగా మారతారని ఉండి సర్పంచి కమతం సౌజన్య బెనర్జీ అన్నారు. సోమవారం ఉండి, యండగండి శాఖా గ్రంథాలయాల్లో గ్రంథాలయ వారోత్సవాలను సర్పంచి కమతం సౌజన్య బెనర్జీ, మండల పరిషత్ అధ్యక్షులు ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు, విజయలక్ష్మి ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ నల్లా సత్యకృష్ణ కిరణ్, యండగండి ఉపసర్పంచి పి.జగ్గరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులందరూ ప్రతిరోజూ గ్రంథాలయాలకు వెళ్లి విలువైన పుస్తకాలు చదవాలన్నారు. కార్యక్రమంలో ఎంపిటిసిలు గిరిడా రమణ శ్రీనివాస్, కునుకు రమాదేవి శ్రీనివాస్, దత్తాల సుజాత రాణి, యండగండి రూరల్ బ్యాంక్ సెక్రటరీ చేకూరి రవికుమార్, నాయకులు రణస్థుల మహంకాళి, కమతం బెనర్జీ, విశ్వహిం దూ పరిషత్ సభ్యురాలు సునీత పాల్గొన్నారు.
పాలకొల్లు రూరల్ : ఉల్లంపర్రు మాంటిస్సోరీ స్కూల్లో బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించారు. యునైటెడ్ కాపు క్లబ్ ప్రెసిడెంట్ గాది ఆంజనేయులు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో మాంటిస్సోరీ స్కూల్ సెక్రటరీ కరస్పాండెంట్ మద్దాల రాంప్రసాద్, డైరెక్టర్ మద్దాల వాసు, ప్రిన్సిపల్ సామవేదం వసంతలక్ష్మి, యునైటెడ్ కాపు క్లబ్ సెక్రటరీ పి.రవి పాల్గొన్నారు.
పెనుమంట్ర :మార్టేరు రోటరీ క్లబ్‌లో మానవత ఆధ్వర్యంలో మంగళవారం రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గుడిమెట్ల లక్ష్మణ్ రెడ్డి, మానవత అధ్యక్షులు బాణాల శ్రీనివాసరావు 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు, బాలల దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. రోటరీ సెక్రటరీ చింత ధర్మ వీరనారాయణరెడ్డి, మానవత సెక్రటరీ బండి ప్రసాద్, గాంధీజీ, నెహ్రూల చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మానవత అధ్యక్షులు బాణాల శ్రీనివాసరావు, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గుడిమెట్ల లక్ష్మణ్ రెడ్డి, మార్టేరు సర్పంచి మట్టా కుమారి మాట్లాడారు. కార్యక్రమంలో మానవత ఛైర్మన్ చిర్ల సూర్యనారాయణ రెడ్డి, మానవత ఆత్మీయ సహకార కమిటీ ఛైర్మన్ చిర్ల శ్రీనివాస్‌రెడ్డి, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ రామారెడ్డి పాల్గొన్నారు.
భీమవరం రూరల్ : అడవి బాపిరాజు చిత్రలేఖనం పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బాలల దినోత్సవం సందర్భంగా బహుమతులు అందజేశారు. ఇటీవల చింతలపాటి బాలరాజు ఉన్నత పాఠశాలలో బాలోత్సవం కమిటీ, పోరం ఫర్ ఆర్ట్స్, డ్రాయింగ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో వేల మంది బాల బాలికలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ కేటగిరిలో ప్రత్యేక బహుమతులను, డిఎన్‌ఆర్ కళాశాలకు కళాశాల అసోసియేషన్‌కు అనుబంధంగా ఉన్న వెంకటేశ్వర బధిర పాఠశాల విద్యార్థులకు కూడా బహుమతులు ప్రకటించారు. వాటిని బాలల దినోత్సవం సందర్భంగా వాటిని గాంధీ కస్తూరిబా సేవా సంఘం భవనం వద్ద విద్యార్థులకు అందజేశారు.
ఆదిత్య హైస్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాల బాలికలు వివిధ వేషధారణలతో అందరినీ అలరించారు. స్కూల్ డైరెక్టర్ ఆదిత్య కృష్ణంరాజు, ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడారు. అనంతరం నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఆదిత్య 'కృష్ణంరాజు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.
గణపవరం : నేటి యువతరానికి నెహ్రూ జీవితం ఆదర్శనీయమని గణపవరం సర్పంచి మూరా అలంకారం అన్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నెహ్రూ జయంతిని ఘనంగా నిర్వహించారు. అనంతరం నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రంథ పాలకురాలు సుభాషిని మాట్లాడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పిప్పర గ్రంథాలయంలో వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో పాల్గొన్న మాజీ మంత్రి ఇందుకూరి రామకృష్ణంరాజు మాట్లాడారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రియాంక, పంచాయతీ కార్యదర్శి జి.బాలకృష్ణ పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం : తాడేపల్లిగూడెం ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో నెహ్రూ జయంతిని నిర్వహిం చారు. గరికపాటి బాపయ్య శర్మ అధ్యక్షతన రాష్ట్ర గ్రంధాల య పరిషత్ సభ్యులు వై.నరసింహారావు వారోత్సవాలను ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ అనపర్తి సామ్యూల్ కార్యక్రమాలను ప్రారంభించారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఎంఇఒ సాల్మన్‌రాజు, కె.వెంకటేశ్వరరావు, గర్ల్స్ హైస్కూల్ హెచ్‌ఎం శ్రీనివాస్ పాల్గొన్నారు. శశి ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పిల్లలకు పలు పోటీలు నిర్వహించారు. అనంతరం ఇన్‌ఛార్జి హెడ్ మాస్టర్ రామకృష్ణ, కళాశాల ప్రిన్సిపల్ మొహ మ్మద్ ఇస్మాయిల్ మాట్లాడి, విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
వీరవాసరం : గ్రంథాలయ వారోత్సవాలు మండలంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక బోను పవిడియ్య శాఖా గ్రంథాలయంలో వీరవాసరం సర్పంచి చికెలే మంగతాయారు, రాయకుదురు సర్పంచి సర్పంచి గెడ్డం భారతీ భాస్కరరావు నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రారంభించారు. బాలల దినోత్సవం సందర్భంగా పలు పాఠశాలల విద్యార్థులు గ్రంథాలయ వారోత్సవాలలో పాల్గొని దేశభక్తి గీతాలు ఆలపించారు. అనంతరం సర్పంచులు మాట్లాడారు. కార్యక్రమంలో చెన్ను భుజంగరావు, ఆర్.గాంధీ పాల్గొన్నారు.
పుస్తక పఠనంతో విద్యార్థులు మేధాశక్తిని పెంచుకోవచ్చని చినఅమిరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని వేగేశ్న అనురాధ విద్యార్థులకు సూచించారు. ముందుగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రంథాలయానికి కావాల్సిన పుస్తకాలు అందజేశారు. అలాగే విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిహెచ్ ప్రసాదరావు పాల్గొన్నారు.
పోడూరు : గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచి జమ్ము బేబీ మహాలక్ష్మి అన్నారు. జిన్నూరు శాఖా గ్రంథాలయంలో వారం రోజులపాటు జరగనున్న 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఆమె ప్రారంభించారు. తొలుత గ్రంథాలయ ఆవరణలోని గాంధీ విగ్రహానికి నివాళులర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పుస్తక పంపిణీ కేంద్రాల నిర్వాహకులు కొట్టి రామం, మంగాలక్ష్మి, ఉదయ భాస్కర్ పాల్గొన్నారు.
పాలకొల్లు : జివిఎస్‌విఆర్‌ఎం మున్సిపల్ స్కూల్లో బాలల దినోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎంఇఒ-2 ఆర్‌ఎన్‌విఎస్‌జి.శర్మ మాట్లాడారు. సమ సమాజ నిర్మాణమే ధ్యేయంగా ఎంచుకోవాలన్నారు. అనంతరం నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాయపూడి భవానీ ప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వైష్ణవి విద్యార్థుల ఔదార్యం
ఆచంట మండలానికి చెందిన విద్యార్థి శీలం దివ్య (9) లివర్ కేన్సర్‌తో బాధపడుతోంది. చిన్నారి వైద్యం నిమిత్తం పాలకొల్లు శ్రీవైష్ణవి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, బంధువులు, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది సేకరించిన రూ.1,28,779ను దివ్య తల్లిదండ్రులకు మంగళవారం అందించారు. బాలల దినోత్సవం సందర్భంగా వైష్ణవి హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా హాజరైన అగ్ని మాపక సిబ్బంది బివి రమణ విద్యార్థినులను, తల్లిదండ్రులను ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా పలు క్రీడా పోటీల్లో విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు.
మొగల్తూరు : విద్యార్థులు బాగా చదువుకున్న ఉన్నత శిఖరాలు చేరుకోవాలని దాత గ్రంధి బాబి అన్నారు. బాలల దినోత్సవాన్ని మొగల్తూరులోని రెండో నంబరు పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయుని పాలపర్తి ఉషారాణి ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం బహుమతులు అందజేశారు.
ఉండి : నేటి బాలలే రేపటి పౌరులు అని వాండ్రం గ్రామ సర్పంచి దాసరి వెంకటకృష్ణ అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా వాండ్రంలోని అంగన్‌వాడీ కేంద్రానికి ఎస్‌బిఐ ఉండి బ్రాంచి మేనేజర్ నాగబాబు, భీమవరం రీజినల్ బ్రాంచి మేనేజర్ కె.నాగశయన రాజు సుమారు రూ.70 వేల విలువచేసే ఆర్‌ఒ వాటర్ ఫిల్టర్, టీవీ, ట్యాబ్‌లు అందజేశారు.