Dec 03,2022 23:29

మాట్లాడుతున్న ఎంపి సత్యవతి

ప్రజాశక్తి-మాకవరపాలెం:తల్లిదండ్రుల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని అనకాపల్లి ఎంపీ సత్యవతి ఆకాంక్షించారు. శనివారం అవంతి కాలేజీలో ఇండక్షన్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. విద్యా దానం అన్ని దానాల్లో గొప్పదని, అవంతి కళాశాలతో గ్రామీణా ప్రాంత యువతను మంచి విద్యా వంతులుగా తీర్చి దిద్దుతున్నారన్నారు. ప్రభుత్వం ఎన్నో పథకాలు ద్వారా విద్యా అభివృద్ధికి కృషి చేస్తుందని, పేద విద్యార్థులు లబ్ది పొంది జీవితంలో స్థిర పడాలన్నారు. ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాస్‌ మాట్లాడుతూ, విద్యార్థులు ప్రముఖ స్థలంలో ఉద్యోగం సంపాదించాలనే లక్ష్యంతో చదవాలన్నారు. ఆంగ్ల భాషలో మంచి ప్రావీణ్యం సంపాదించుకోవాలని తెలిపారు. స్వామి వివేకానంద ప్రవహించిన పల ఉవిషయాలను గుర్తుచేశారు. కలలు కని వాటిని విద్యార్థిలు నిజం చేసుకోవాలన్నారు. మన ఆలోచనలు విభిన్నంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియన్‌ ఆర్మీ సబేదర్‌ రాజేష్‌ కుమార్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ మోహన్‌రావు, కళాశాల పరిపాలన అధికారి దంగల్‌ దానిడేలు రాజు, సిబ్బంది పాల్గొన్నారు.