ప్రజాశక్తి-ఆలూరు
విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదివి తల్లిదండ్రులకు, గురువులకు, పాఠశాల, కళాశాలకు మంచిపేరు తీసుకురావాలని వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ గుమ్మనూరు నారాయణ స్వామి తెలిపారు. గురువారం జూనియర్ కళాశాల ఆడిటోరియంలో 'జగనన్న ఆణిముత్యాలు'లో భాగంగా నియోజకవర్గంలో పది, ఇంటర్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు, ప్రశంసాపత్రం అందజేసి, తల్లిదండ్రులను, ప్రధానోపాధ్యాయులను, ప్రిన్సిపల్స్‌ను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది పది, ఇంటర్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు శ్రావణి స్వామి, శ్రీనివాసులు, తస్లీమ్, జయప్రకాష్, మంతేషా, వన్నూర్ స్వామి, విజరు కుమార్‌ను, వారి తల్లిదండ్రులను సన్మానించి, ప్రశంసాపత్రాలతో పాటు మెడల్, నగదు బహుమతులను అందించారు. జడ్‌పిటిసి ఏరూరు శేఖర్, ఆలూరు ఎంఇఒ రామాంజనేయులు, విశ్రాంత ఎంఇఒ కోమలదేవి, ప్రిన్సిపల్ వీరేశ్, శంకర్ ప్రసాద్, జమ్మన్న, డేవిడ్, ప్రధానోపాధ్యాయులు చక్రధర్, కోదండ నాయుడు, సుజాత, మల్లికార్జున, కరి బసప్ప, శ్రీనివాస రెడ్డి, సావిత్రమ్మ, ఎస్‌టియు నాగరాజు, వైసిపి కన్వీనర్ వీరేశ్, ఎస్‌ఎంసి ఛైర్మన్ అనుమయ్య, ఎంపిపి తనయుడు వీరేష్, దీపక్ పాల్గొన్నారు.
విద్యార్థి, తల్లిదండ్రులకు అవార్డులిచ్చి శాలువాతో సన్మానిస్తున్న ఎంఇఒ, గుమ్మనూరు నారాయణ స్వామి










