
ప్రజాశక్తి-అమలాపురం రూరల్
విద్యార్థులు కష్టపడి చదువుకుని, మంచి జ్ఞానం సంపాదించి సృజనా త్మకతను పెంచు కోవాలని పిడిఎఫ్ ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు అన్నారు. సోమ వారం అమలాపురం మండలం ఎ.వేమవర ప్పాడు ఎంపియుపి స్కూల్‌ను సందర్శించి విద్యార్థుల సృజనాత్మకతను పరీక్షించి అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వాష్ రూమ్స్ నిర్మాణం అసంపూర్తిగా ఉండడం గమనించారు. అసంపూర్తిగా ఉన్న వాష్ రూమ్స్ నిర్మాణాన్ని పూర్తి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ అమలాపురం మండల పరిషత్ అధ్యక్షులకు, మండల విధ్యాశాఖాధికారికి లేఖలు రాశారు. అలాగే ఎంపిపి కుడిపూడి భాగ్యలక్ష్మి తో ఇదే విషయమై ఫోన్లో మాట్లాడగా కాంట్రాక్టర్ సమస్య ఉన్నదని త్వరలో పూర్తి చేస్తామని ఆమె ఎంఎల్‌సి ఐవికి హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి ఎంఎల్‌సి ఐవిమాట్లాడారు. వారి సజనాత్మకతను పరీక్షించే చిన్న చిన్న ప్రశ్నలు అడిగారు. మధ్యాహ్న భోజన పథక పనితీరును పరిశీలించి పలు సూచనలు చేశారు.