Oct 06,2023 21:58

ప్రజాశక్తి - భీమవరం అర్బన్‌
             విద్యార్థులు శారీరక వ్యాయామం చేస్తూ చక్కని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని ఎస్‌ఆర్‌కెఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ డాక్టర్‌ ఎం.జగపతిరాజు అన్నారు. భీమవరం ఎస్‌ఆర్‌కెఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఎఐసిటిఇ ద్వారా చేసిన సూచనల మేరకు కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం ఆధ్వర్యంలో 3కె వాక్తాన్‌ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కళాశాల ప్రాంగణంలోని సృజన వాటిక నుంచి కళాశాల ప్రాంగణమంతా ఫిట్‌ ఇండియా అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జగపతిరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానంలో విద్యార్థి చదువుతోపాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని పెం పొందించుకునే వి ధంగా కళాశాల స్థాయిలో పలు కార్యక్రమాలు ని ర్వహించాలని సూ చించిందన్నారు. గతం లో జాతీయ స్థాయిలో ఎఐసిటిఇ నిర్వ హించిన ఫిట్‌ ఇండియా ఛాలెంజ్‌ పోటీల్లో రెండు విభాగాల్లో తమ కళాశాల విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారని చెప్పారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం విద్యార్థులు యోగా, వ్యాయామం క్రీడలు వంటి వాటిలో శిక్షణ పొందితే సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఆర్‌.కృష్ణచైతన్య, ఎన్‌ఎస్‌ఎస్‌ సహాయ కో-ఆర్డినేటర్‌ కెఎన్‌వి.సత్యనారాయణ, మాధవరావు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.