May 07,2023 01:37
సమ్మర్‌ క్యాంపులో పాల్గొన్న రోటరీ సభ్యులు

ప్రజాశక్తి-అద్దంకి: విద్యార్థులు విద్యతో పాటు, సేవ, సామాజిక దృక్పథం అలవరచుకొని బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని పలువురు ఉద్బోధించారు. అద్దంకి ఎన్టీఆర్‌ కాలేజీలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో హైస్కూల్‌ విద్యార్థులకు నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన తరగతుల కార్యక్రమానికి ఆ సంస్థ ఆహ్వానంపై రోటరీ క్లబ్‌ ఆఫ్‌ సింగరకొండ అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి రోటరీ అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసరావు, సభ్యులు నర్రా శ్రీలక్ష్మి, జాగర్లమూడి శివకుమారి, అద్దంకి లెవిప్రసాద్‌, షేక్‌ మొహమ్మద్‌ రఫీ, చప్పిడి వీరయ్య, మన్నం త్రిమూర్తులు ఉపన్యసించారు. విద్యార్థులు జెవివి నిర్వహిస్తున్న వేసవి శిక్షణను వినియోగించుకోవాలని కోరారు.