చిత్తూరుఅర్బన్: విద్యార్థులు సామాజిక బాధ్యతతో కలిగి ఉండాలని కేఎన్‌ఆర్ తిరుమల ఇన్ ఎఫ్ ఆర్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత కృష్ణారావు అన్నారు. తమ సంస్థ నిధులతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాణిపాకంలో నిర్మించిన వెస్ట్రన్, ఇండియన్ టాయిలెట్స్ ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థీ చదువుతోపాటు సామాజిక బాధ్యతను కలిగి ఉండాలని తెలియజేశారు. అలాగే సేవా దక్పథం చిన్నతనం నుండి అలవర్చుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని కోరారు. మరో అతిథి మేఘన సీనియర్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ బాలికలు క్రమశిక్షణతో విద్యాభ్యాసాన్ని వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ నాయుడు అధ్యక్షత వహించి మాట్లాడుతూ కేఎన్‌ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సహకారం ఎప్పటికీ మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో కెఎన్‌ఆర్ తిరుమల ఇంటర్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజర్ నాగరాజు, సిబ్బంది పాఠశాల ఉపాధ్యాయులు సోమశేఖర్ నాయుడు, సురేంద్ర బాబు, సురేష్ బాబు పాల్గొన్నారు.










