విద్యార్థినీ విద్యార్థులతో సెల్ఫీ దిగుతున్న కలెక్టర్
నాదెండ్ల: మండలంలోని అమీన్ సాహెబ్ పేట జిల్లా పరిషత్ ప్రాథమి కోన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ శనివారం పర్యటించారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులలో ఫార్మేటివ్ అసెస్మెంట్ టెస్ట్‌బి2 లో ముందు వరుసలో నిలిచిన విద్యార్థులతో సెల్ఫీ తీసుకునే కార్య క్రమంలో పాల్గొన్నారు. పలువురు విద్యార్థినీవిద్యార్థులతో సెల్ఫీ తీసుకొని వారితో ముచ్చటించారు. ప్రతి సబ్జెక్టులోనూ సమాన దృష్టి పెట్టి ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. లక్ష్యాలను ముందుగానే నిర్దేశించుకుని వాటికి అను గుణంగా పక్కా ప్రణాళికతో చదువుకోవాలని చెప్పారు. విద్యా ర్థినీ విద్యార్థులకు చాక్లెట్లు బహుకరించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్గొన్నారు.










