Jun 26,2023 02:11
కళాశాల వారి నుంచి సన్మానం అందుకుంటున్న పూనం మాలకొండయ్య

ప్రజాశక్తి-పిట్టలవానిపాలెం: విద్యార్థులు విద్యార్థి దశ నుంచి తమపై తాము నమ్మకంతో చదువుకోవాలని ఐఏఎస్‌ డాక్టర్‌ పూనం మాలకొండయ్య అన్నారు. మండ లంలోని ఖాజీపాలెం గ్రామంలోని కెవిఆర్‌, కెవిఆర్‌ అండ్‌ ఎంకెఆర్‌ కళాశాలలో శనివారం రాత్రి 42వ వార్షికోత్సవం సందర్భంగా ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుంచి క్రమశిక్షణతో ఉండాలని అన్నారు. అధ్యాపకులపై గౌరవంగా ఉంటే ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్‌కు బాటలు వేసుకున్న వారు అవుతారన్నారు. తాను చిన్న నాటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొని చివరికి అనుకున్నది సాధించానని విద్యార్థులలో స్ఫూర్తిని నింపారు. మనం ఎంచుకునే రంగంలో రాణించాలంటే నిజాయితీ, నిబద్ధత, నిస్వార్ధం ఎంతో ముఖ్య మని అన్నారు. కళాశాల అధ్యక్షుడు డాక్టర్‌ నరస రాజు మాట్లాడుతూ విద్యార్థులకు కంప్యూటర్‌పై నైపుణ్యం పెంచటానికి సుమారు 5000 మందికి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఈ కళాశాల అన్ని విధాలుగా తోడ్పాటు అందించి వారి భవితకు భరోసా కల్పిస్తోందని అన్నారు. అనంతరం పలు అంశాల లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమ తులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళా శాల వైస్‌ ప్రెసిడెంట్‌ శివరామరాజు, జాయింట్‌ సెక్రటరీ కృష్ణంరాజు, కళాశాల ప్రిన్సిపాల్‌ శివ ప్రసాద్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.