
ప్రజాశక్తి - గోపాలపురం ప్రతి విద్యార్థి క్రమశిక్షణ అలవర్చుకుని, సాంకేత పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎంఇఒ తిరుమల దాస్ సూచించారు. గురువారం మండలంలోని భీమోలు జడ్‌పిఉన్నత పాఠశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని జడ్‌పి ఉన్నత పాఠశాలలను మూడు రోజులపాటు సందర్శించి విద్యార్థుల నోట్ బుక్స్, సిలబస్, అకాడమిక్ స్టాండర్డ్స్, చదువుపై విద్యార్థుల సామర్ధ్యాలను పరిశీలించినట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణ అలవర్చుకోవాలని అన్నారు. సాంకేత పరిజ్ఞానం పెంపొందించుకొని ప్రణాళికతో చదువును ఆసక్తితో చదవాలన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం వలవల రామారావు , చాపల రామారావు, స్కూల్ కాంప్లెక్స్ ఛైర్మన్ లక్ష్మీ నరసింహ శాస్త్రి, ఉపాధ్యాయులు సిఆర్‌పి కొయ్య నాగరాజు పాల్గొన్నారు.