Oct 22,2022 23:41

గోల్డ్‌ మెడల్‌ సాధించిన విద్యార్థిని అభినందిస్తున్న పీఓ సూరజ్‌ గనోరే

ప్రజాశక్తి-రాజవొమ్మంగి
ఏజెన్సీలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలలో చదువుచున్న విద్యార్థులు విద్యతో పాటు క్రీడలపైనా దృష్టి సారించాలని, అందుకు అనుగుణంగా తగు ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుందని రంపచోడవరం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సూరజ్‌ గనోరే అన్నారు. రంపచోడవరం మండలం బందపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న కోసు సర్విన్‌ బాబు దొర ఈనెల 17 నుండి 19 వరకు ఢిల్లీలోని జరిగిన జాతీయ క్రీడల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్‌ నుండి డబల్‌ అండర్‌ రిలే ఈవెంట్‌లో పాల్గొని గోల్డ్‌ మెడల్‌ సాధించారు. ఈ నేపథ్యంలో రంపచోడవరం పిఒ సూరజ్‌ గనోరే శనివారం విద్యార్థి సర్విన్‌ బాబు దొరకు అభినందించారు. సదరు విద్యార్థికి బాగా శిక్షణ ఇచ్చేందుకు ఏయే పరికరాలు కావాలో ప్రతిపాదనలు తయారు చేసి ఇవ్వాలని ఫిజికల్‌ డైరెక్టర్‌ కె.తిరుపతిరావు, ప్రధానోపాధ్యా యులు ఎం.శ్రీరాములును ఆదేశించారు. ఈ సందర్భంగా పిఒ మాట్లాడుతూ, ఏజెన్సీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో క్రీడలపై ఆసక్తి ఉన్న విద్యార్థులను ఎంపిక చేసి, ముసురుమిల్లి స్పోర్ట్స్‌ స్కూల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏ పరికరాలు కావాలో ప్రతిపాదనలు సమర్పించాలని కోరారు. రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడల్లో పాల్గొనేందుకు గిరిజన విద్యార్థులను ఎంపిక చేసి ప్రత్యేక దృష్టి పెట్టి మంచి మెనూ అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. సర్విన్‌ బాబు దొరకు రిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ సిహె.శ్రీనివాసరావు, ఏటిడబ్ల్యుఓ, రామ తులసి, లైజన్‌ అధికారి బిఎస్‌ కుమార్‌, ఎంపీటీసీ, ఎం.సాయిబాబా, ఏఎంఓలు కె.శ్రీనివాసరావు, ప్రసాద్‌, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.