
ఆగిరిపల్లి : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా పాల్గొనటం వలన దేహాదారుఢ్యంతో పాటు, శారీరక, మానసిక ప్రశాంతత నెలకొంటుందని చుక్కపల్లి చారిటబుల్ ట్రస్టు కార్యదర్శి చుక్కపల్లి సుధ అన్నారు. బుధవారం ఆగిరిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు విలువైన క్రీడా సామాగ్రిని ఆమె అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.పుష్పలత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.