ఆగిరిపల్లి : విద్యార్థులు చదువుతో పాటు, క్రీడలకు ప్రాధ్యానత్యను ఇవ్వాలని రాష్ట్ర సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు తెలిపారు. క్రీడలు దేహ దారుఢ్యానికి, మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతగానో దోహాదపడతాయన్నారు. మండల పరిధిలోని తోటపల్లి హీల్ స్కూల్‌ను ఆయన శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా అంతరాష్ట్ర సిబిఎస్‌ఇ అండర్-19 విభాగంలో యోగా, వాలీబాల్, కబడ్డీ పోటీల్లో బంగారు, వెండి పతకాలు సాధించడంతో పాటు, జాతీయ పోటీలకు ఎంపికైన విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో హీల్ వ్యవస్థాపక అధ్యక్షులు కె.సత్య ప్రసాద్, సిఇఒ కె.అజరు కుమార్ పాల్గొన్నారు.










