ప్రజాశక్తి - చింతలపూడి
క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని బయటకు తీసుకొచ్చేందుకు జగనన్న క్రీడా సంబరాలు ప్రారంభించినట్లు ఎంఎల్‌ఎ ఉన్నమాట్ల ఎలిజా అన్నారు. పట్టణంలో గురువారం నిర్వహించిన జగనన్న క్రీడా సంబరాల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫైనాల్స్‌లో గెలిచే జట్టుకు రూ.లక్ష ఇవ్వనున్నట్లు తెలిపారు. విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలన్నారు. క్రీడాకారులు పట్టుదలతో, నమ్మకంతో ఉండాలన్నారు. గెలుపు మీద దృష్టి పెట్టి నైపుణ్యాన్ని బయటకు తీసి నియోజకవర్గం పేరు రాష్ట్ర స్థాయిలో నిలబెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి ఛైర్మన్ జగ్గవరపు జానకిరెడ్డి, ఎంపిపి రాంబాబు, పట్టణ అధ్యక్షులు కొప్పుల నాగు, వెంపా కృష్ణ, మిర్యాల దిలిప్, ఆత్కూరి సుబ్బారావు, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు వేణు, సుధాకర్, ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.










