విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
ప్రజాశక్తి - గూడూరు రూరల్ : విద్యార్థులు క్రీడల్లో రాణించాలనిస్వచ్చఆంధ్ర సంస్థ చైర్ పర్సన్ పోణకా దేవసేనమ్మ పేర్కొ న్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యక్ర మంలో భాగంగా గూడూరు లోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఎస్.జి.ఎఫ్ కమిటీ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి క్రీడాపోటీలు నిర్వహించారు. ఈ క్రీడాపోటీలకు ముఖ్య అతిథులుగా స్వచ్చఆంధ్ర సంస్థ చైర్ పర్సన్ పోణకా దేవసేనమ్మ, ఆర్డీవో కిరణ్ కుమార్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వచ్ఛ ఆంధ్ర సంస్థ చైర్ పర్సన్ దేవసేనమ్మ మాట్లాడుతూ మండలాల స్థాయిలో గెలుపొందిన క్రీడా కారులకు నియోజకవర్గ స్థాయిలో పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇక్కడ పాల్గొన్న క్రీడాకారులు ప్రతిభ కనపరిచి జిల్లాస్థాయిలో ప్రతిభ కనపరిచి గూడూరుస్థాయిని పెంచాలన్నారు. రాష్ట్రస్థాయిలో విజయం సాధించి గూడూరుకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నారని, అందరూ బాగా ఆడాలని పేర్కొన్నారు. ఆర్డీవో కిరణ్ కుమార్ మాట్లా డుతూ విద్యార్ధులకు మూడు ప్రశ్నలు వేస్తున్నానన్నారు. చంద్రయాన్ 3, ఆదిత్య ఎల్- 1. జనరల్ నాలెడ్జికి సంబంధించిన ప్రశ్నలు వేసి వారినుండి జవాబులు రాబట్టారు. విద్యార్థులు క్రీడల తో పాటు చదువులోను రాణించాలన్నారు. అనంతరం స్వచ్చఆంధ్ర సంస్థ చైర్ పర్సన్ దేవసేనమ్మ, ఆర్డీవో కిరణ్ కుమార్ జెండా ఊపి క్రీడలు ప్రారంభించారు. విద్యార్థులు ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవంలో ఎంఈవో కాంచన, క్రీడల నిర్వహణ కార్యదర్శి శివకుమార్, వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సుబ్రమణ్యం, ఉప విద్యాశాఖాధికారి శివప్రకాష్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు రవూప్ పాల్గొన్నారు.










