ప్రజాశక్తి - చీరాల
నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఇవ షూటింగ్ బాల్ మెన్ అండ్ ఉమెన్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు రాష్ట్రం వ్యాప్తంగా 16జిల్లాల నుండి బాల బాలికలు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా బాలికల జట్టు 3వ స్తానాన్ని, బాలుర జట్టు 4వ స్తానాన్ని సాదించింది. విజేతలను బాపట్ల జిల్లా షుటింగ్ బాల్ అధ్యక్షులు డాక్టర్ బాబురావు, కార్యదర్శి పిల్లి సురేంద్ర అభినందించారు. విజయానికి కారణమైన బాపట్ల జిల్లా కమిటీ సభ్యులు, కోబ్ వి హరిత ప్రశంసించారు.










