Sep 08,2023 21:55

ప్రజాశక్తి - తణుకు రూరల్‌
            విద్యార్థినులు కాలాన్ని వృధా చేయకుండా విద్యపై దృష్టి పెట్టాలని న్యాయవాది వంగూరి కిషోర్‌ అన్నారు. స్థానిక ఎస్‌కెఎస్‌డి మహిళా జూనియర్‌ కళాశాలలో విద్యార్థినుల ఫ్రెషర్స్‌ డే వేడుకలు కళాశాల ప్రిన్సిపల్‌ భూపతిరాజు హిమబిందు అధ్యక్షతన శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కిషోర్‌ మాట్లాడుతూ విద్యార్థినులు చెడు విషయాల పట్ల ఆకర్షితులవ్వకూడదన్నారు. సమయపాలన అలవర్చుకోవాలని సూచించారు. విద్యారంగంలో తణుకుకు ఒక సుస్థిర స్థానాన్ని అందించడంలో ముఖ్యభూమిక వహించిన ఎస్‌కెఎస్‌డి కళాశాల వ్యవస్థాపకులను అభినందించారు. కళాశాల కరస్పాండెంట్‌ చిట్టూరి సత్యఉషారాణి మాట్లాడుతూ కళాశాల ప్రాంగణం దేవాలయం వంటిదని, విద్యార్థినులు మంచి ప్రవర్తనతో, నిజాయితీగా ఉండి విద్యను అభ్యసించి ఉన్నత స్థితికి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యక్షులు కెవి.సుబ్బారావు, ట్రెజరర్‌ నందిగం సుధాకర్‌, డిగ్రీ, పిజీ కళాశాల ప్రిన్సిపల్‌ కె.రామకృష్ణ, వివేకానంద గ్లోబల్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ ఆర్‌.రవీంద్ర పాల్గొన్నారు.