విద్యార్థులకు వైద్య పరీక్షలు చేస్తున్న వైద్యులు
ప్రజాశక్తి-అనంతగిరి:మండలంలోని గుమ్మకోట పంచాయతీ పరిధి పలు గ్రామాల్లో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక సర్పంచ్ పాగి. అప్పారావు ఆధ్వర్యాన శుక్రవారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. గుమ్మకోట గురుకుల పాఠశాలలో మంది విద్యార్థులు, భీమవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణులకు వైద పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో భీంపోలు ఎంపీటీసీ శిరిగం అశోక్. గుమ్మ కోట పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ బుచ్చిబాబు, తదితరులు పాల్గొన్నారు.










