ప్రజాశక్తి - టి.నరసాపురం
విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా వుండాలని ఎస్‌ఐ కె.సతీష్ కుమార్ సూచించారు. మండలంలోని టి.నరసాపురం, బొర్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను మంగళవారం ఆయన సందర్శించి విద్యార్థులకు పోక్సో చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బాల్యం నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. బాలికలను ఈవ్‌టీజింగ్, రాగింగ్ చేస్తే చట్టప్రకారం శిక్షర్హులని, అటువంటి వారి గురించి వెంటనే పోలీస్‌లకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. మాధకద్రవ్యాలు, చెడువ్యసనాల వలన యువత బంగారు భవిషత్తు నాశనమౌతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బి.లింగస్వామి, ఆలీ, ఉపాధ్యాయులు ఆర్‌విజి కృష్ణారావు, కె.కుటుంబరావు, రాజు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.










