Oct 07,2023 17:53

సమావేశంలో మాట్లాడుతున్న ఎంఇఒ సావిత్రి

ప్రజాశక్తి - చిప్పగిరి
విద్యార్థులు చదువులో మంచి ప్రతిభ కనబరచాలని ఎంపిడిఒ కొండయ్య, ఎంఇఒ సావిత్రి, ఎంఇఒ-2 బాలనాయుడు సూచించారు. శనివారం చిప్పగిరి కస్తూరిబా బాలికల కళాశాలలో కస్తూరిబా కళాశాల ప్రిన్సిపల్‌ సౌజన్య ఆధ్వర్యంలో 'సంకల్ప సత్త హై' నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఇఒ సావిత్రి, ఎంపిడిఒ కొండయ్య మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ చిప్పగిరి మండలాన్ని ఆస్పరేషన్‌ బ్లాక్‌గా ఎంపిక చేయడం హర్శించదగ్గ విషయమన్నారు. విద్యార్థులకు విద్య, డ్రాయింగ్‌, గర్ల్స్‌ ఎగ్జిబిషన్‌పై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన నగరడోన ఉపాధ్యాయులు మహ్మద్‌ రఫీని, ఉత్తమ విద్యార్థిగా ఎంపికైన చిప్పగిరికి చెందిన 8వ తరగతి విద్యార్థి హారికను శాలువా, పూలమాలతో సన్మానించారు. అనంతరం విద్యార్థులకు డ్రాయింగ్‌ వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి నాగభూషణం పాల్గొన్నారు.