Oct 13,2023 17:22

ప్రజాశక్తి - చింతలపూడి
   విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించే విధంగా విద్యాబోధన జరగాలని ఎంఇఒ-2 కిరణ్‌బాబు తెలిపారు. మండలంలో ఎంపిపియస్‌ బాలవారి గూడెం పాఠశాలను సందర్శించి, మధ్యాహ్న భోజనం, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్క విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ పెట్టాలన్నారు. విద్యాబోధన జరిగిన తరువాత విద్యార్థులతో పాఠ్యాంశాలపై చర్చలు జరిపితే విద్యార్థులకు బాగా గుర్తుండిపోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వేణు పాల్గొన్నారు.