విద్యార్థులతో పనులు చేయించొద్దు : డిఇఒ
ప్రజాశక్తి - బాలాయపల్లి
విద్యార్థులకు చదువు చెప్పాలే కానీ, వారితో పనులు చేయించడం తగదని జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్ అన్నారు. మండలంలోని వెంగమాంబపురం గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగునీరు లేకపోతే ఆయా, మధ్యాహ్న భోజన నిర్వాహకులతో తెప్పించుకోవాలే తప్ప, విద్యార్థులతో ఎలా తెప్పిస్తారని మండిపడ్డారు. ఏమన్నా జరిగితే మీరు బాధ్యులవుతారా అని ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయునిపై మండిపడ్డారు. పదో తరగతి సిలబస్ ఎంతవరకు అయ్యిందో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్ కల్లా సిలబస్ పూర్తి చేసి, అప్పటినుంచి ప్రత్యేక తరగతులు నిర్వహించి, అదనపు తరగతులు తీసుకుని, వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళికలు తయారు చేయాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. ఆయన వెంట మండల విద్యాశాఖ అధికారులు ఉన్నారు.
డిఇఒ ఆకస్మిక తనిఖీ










