ప్రజాశక్తి-చీరాల: బిట్ ల్యాబ్స్ సాఫ్ట్‌వేర్ కంపెనీ, బెంగుళూరు ఆధ్వర్యంలో కంపెనీ హెచ్‌ఆర్ ప్రతినిధులు రాకేష్ బృందం ఆధ్వర్యంలో జరిగిన ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష, సాంకేతికత పరీక్షల్లో చీరాల ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణ ఎంపికల్లో 22 మంది విద్యార్థులు ఎంపిక అయ్యినట్లు కళాశాల ప్రిన్సిపాల్ రవికుమార్ అన్నారు. గత రెండు రోజులుగా జరుగుతున్న ప్రాంగణ ఎంపికలు మంగళవారంతో ముగిశాయి. బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న ఇసి, ట్రిపుల్ ఈ, సిఎస్‌ఇ, విద్యార్థులు 70 మంది హాజరయ్యారు. ఎంపికైన విద్యార్థులకు కళాశాల, కంపెనీ ప్రతినిధులు నియామకపు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన అభినందన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి రవికుమార్ మాట్లాడుతూ ప్రాంగణ ఎంపికల్లో వరుసగా పెద్ద సంఖ్యలో తమ కళాశాల విద్యార్థులు ఉద్యోగాలు సాధించటం హర్షణీయమన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగాలను సులువుగా దక్కించుకోవాలంటే సాంకేతిక నైపుణ్యంతో పాటు నాయకత్వ లక్షణాలు వంటి అంశాలలో మెరుగైన ప్రతిభ చూపాలన్నారు. దీనికోసం మేనేజ్మెంట్ సహకారంతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. దీని వలన విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని కష్టపడటం ఒకటే దానికి మార్గమని స్పష్టం చేశారు. ఎంపికైన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.3.5 లక్షల ప్యాకేజీ వస్తుందని తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన వారిని యాజమాన్యం తోపాటు అధ్యాపక సిబ్బంది విద్యార్థులుకు అభినందించారు. కార్యక్రమంలో ప్లేస్మెంట్ ఆఫీసర్ బాజీ షాహిద్, హెచ్‌ఓడిలు డాక్టర్ షేక్ బషీరా, డాక్టర్ సౌజన్య, పద్మావతి, విద్యార్థులు పాల్గొన్నారు.










