Sep 04,2023 18:53

జ్ఞానానంద ఇంగ్లీష్‌ మీడియం హైస్కూల్‌ ప్రిన్సిపల్‌ విజయకుమారి
ప్రజాశక్తి - కాళ్ల

             విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని జ్ఞానానంద ఇంగ్లీష్‌ మీడియం హైస్కూల్‌ ప్రిన్సిపల్‌ దాట్ల విజయకుమారి అన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రజాశక్తితో మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తన పూర్తి సామర్థ్యాన్ని గుర్తించి లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తామని చెప్పారు. పాఠశాల విద్య సమాజంలో మార్పు తీసుకురావడానికి ఉపయోగపడుతుందన్నారు. గ్రామీణ పేద విద్యార్థులకు అతి తక్కువ ఫీజులతో ఇంగ్లీష్‌ మీడియం విద్యను అందించాలనే ఆశయంతో కీర్తిశేషులు దాట్ల చిన్నరామచంద్రరాజు 1989లో మండలంలోని ఏలూరుపాడులో జ్ఞానానంద పబ్లిక్‌ స్కూల్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ స్థాపించారన్నారు. ప్రైమరీ విద్యతో ఆరంభించి అంచెంచులుగా హైస్కూల్‌ ప్రారంభించామని చెప్పారు. తన సారథ్యంలో పశ్చిమగోదావరి జిల్లాలోని సమీప గ్రామాలు, కృష్ణాజిల్లా నుంచి విద్యార్థులు స్కూల్‌కి వచ్చేలా ఆకర్షించి నెంబర్‌-1 ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలగా అభివృద్ధి చేశామన్నారు. విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు అతి పెద్ద ఆట స్థలం, సమీప గ్రామాల నుంచి విద్యార్థులను పాఠశాలకు చేర్చేందుకు బస్సు సౌకర్యం కల్పించామన్నారు. విద్యతో పాటు క్రీడలు, సంగీతం, డ్యాన్స్‌, భగవద్గీత, కరాటేలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. పదో తరగతి విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని పాఠశాల అనంతరం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నమన్నారు. హైస్కూల్‌ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు ప్రతి సంవత్సరం పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారన్నారు. మండల స్థాయిలో మొదటి, రెండు స్థానాలు సాధిస్తున్నారన్నారు. ఈ ప్రాంతంలోని పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువుకునేందుకు కష్టంగా ఉన్నందున 2007-08 సంవత్సరంలో దాట్ల చిన్న రామచంద్రరాజు జూనియర్‌ కళాశాలను స్థాపించి పేద విద్యార్థులకు అతి తక్కువ ఫీజులతో కార్పొరేట్‌ విద్యను అందిస్తున్నామన్నారు. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ విద్యార్థులకు ప్రయోగశాలలు ఏర్పాటు చేశామన్నారు. కళాశాలలో ప్రయోగ పరీక్షలు జరుగుతున్నాయన్నారు. కళాశాలలో ప్రతి సంవత్సరం 80 శాతానికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణులవుతున్నారన్నారు. ఎంపిసి, బైసిపి విద్యార్థులకు కళాశాలలో ఎంసెట్‌ కోచింగ్‌ ఇస్తున్నామన్నారు. ఈ సంవత్సరం డిసిహెచ్‌ఆర్‌ఆర్‌ కళాశాల విద్యార్థినులు ఎస్‌ఆర్‌కెఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ, విష్ణు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో సీట్లు సాధించటం గర్వంగా ఉందన్నారు. తన స్వీయ పర్యవేక్షణలో అతి తక్కువ ఫీజులతో ఎల్‌కెజి నుంచి ఇంటర్‌ వరకు విలువలతో కూడిన విద్య అందిస్తున్నామని తెలిపారు.