Sep 30,2023 23:13

విద్యార్థుల్లో సజనాత్మకతను వెలికి తీసేందుకే హ్యాకథాన్‌

విద్యార్థుల్లో సజనాత్మకతను వెలికి తీసేందుకే హ్యాకథాన్‌
అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వివేకానంద రెడ్డి
ప్రజాశక్తి- రేణిగుంట : విద్యార్థుల్లో సజనాత్మకను వెలికి తీసి వివిధ రకాల మోడల్సును తయారు చేయడమే హ్యాకథాన్‌ ఉద్దేశమని శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్‌ కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వివేకానంద రెడ్డి స్పష్టం చేశారు. శ్రీరామ లో స్మార్ట్‌ ఇండియా ఇంటర్నల్‌ హ్యాకథాన్‌ 2023 రేణిగుంట మండలంలోని కరకంబాడి రోడ్‌ లో ఉన్న శ్రీరామ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ లో ఈ నెల 27న స్మార్ట్‌ ఇండియా ఇంటర్నల్‌ హ్యాకథాన్‌ 2023 ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్‌ కాలేజ్‌ యూనివర్సిటీ క్యాంపస్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డి.వివేకానందరెడ్డి విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులలో ఉన్న సజనాత్మకను వెలికి తీసి వివిధ రకాల మోడల్స్‌ ని తయారు చేయటమే హ్యాకథాన్‌ ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డా.కె.జయచంద్ర మాట్లాడుతూ అన్ని రంగాలలోను విద్యార్థులను ప్రోత్సహిస్తున్న కళాశాల యాజమాన్యం ఎల్లపుడు ముందు ఉంటుందన్నారు. విద్యార్థులు చేసిన వివిధ నమూనాలను తిలకించి అందులో ఉత్తమమైనవి ఎంపిక చేసి విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్‌ మన్నెం రామిరెడ్డి, డైరెక్టర్స్‌ మన్నెం రామసుబ్బారెడ్డి, మన్నెం అరవిందుకుమార్‌ రెడ్డి, ఐఐసి కోఆర్డినటర్‌ ఎన్‌ వాసు, కన్వీనర్‌ టి కాటయ్య, కో కన్వీనర్‌ బి శ్రీనివాసన్‌, విద్యార్థులు పాల్గొన్నారు.