విద్యార్థుల్లో ప్రతిభ వెలికి తీసేందుకే హ్యాకథాన్
విద్యార్థుల్లో ప్రతిభ వెలికి తీసేందుకే హ్యాకథాన్
ప్రజాశక్తి - గూడూరు రూరల్ : గూడూరు పట్టణ పరిధి లోని ఆదిశంకర ఇంజనీరిం గ్ కళా శాలలో ఈనెల 28వ తేదీ ఉదయం నుండి 29వ తేదీ ఉద యం వరకు నిరంత రాయంగా 24 గంటల పాటు ప్రిలిమినరీ హ్యాకథాన్‌నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెయ్యి మంది విద్యార్థినివిద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ మోహన్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థుల్లో ప్రతిభను పెంపొందించేందుకు ఆదిశంకర ఇంజినీరింగ్ కళాశాల ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తోం దన్నారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ' నెదర్లాండ్ కి ఎంపిక చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో, ధనుంజయ, రాజయ్య, సురేష్, శిరీష పాల్గొన్నారు.










