Feb 27,2023 23:57

విద్యార్థులకు బోధన చేస్తున్న పరిశీలకులు శంకర్‌

ప్రజాశక్తి-నక్కపల్లి:విద్యార్థుల్లో ప్రాథమిక దశ నుండే చదువులో కనీస అభ్యసన స్థాయిని పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని లెర్నింగ్‌ టీచింగ్‌ జిల్లా పరిశీలకులు శంకర్‌ సూచించారు. మండలంలోని సోమవారం నక్కపల్లి, ఉపమాక గ్రామాల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల లో 3,4,5 తరగతుల్లో ప్రోగ్రాం అమలు తీరును పరిశీలించారు. కరోనా సమయంలో 1వ తరగతిలో చేరిన విద్యార్థులు చదువులో బాగా వెనక పడ్డారని, చదవడం రాయడం రాని విద్యార్థులపై ఉపాధ్యాయుల ప్రత్యేక దృష్టి సారించి లెర్నింగ్‌ టీచింగ్‌ ప్రోగ్రాం ద్వారా వారిలో కనీస స్థాయిని పెంపొందించాలన్నారు.ప్రారంభ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులను గ్రూపులుగా విభజించి, ధారాళంగా చదవడం, అదేవిధంగా రాయడం నేర్పించాలన్నారు.ఉపాధ్యాయుల బోధనా విధానాన్ని నేరుగా పరిశీలించారు. ఆయన కూడా విద్యార్థులకు అనేక కృత్యాలు బోధించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ డివిడి ప్రసాద్‌ పాల్గొన్నారు.