Nov 16,2023 19:48

వ్యాసరచన పోటీలకు హాజరైన విద్యార్థులు

ప్రజాశక్తి-ఉలవపాడు :ఉలవపాడు శాఖా గ్రంథాలయంలో 56వ జాతీయ గ్రంథా లయ వారోత్సవాలు భాగంగా గురువారం విద్యార్థులకు గ్రంథాలయ ఆవశ్యకత అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించినట్టు గ్రంథ పాలకులు దాసరి కోటేశ్వ రరావు తెలిపారు. గురువారం జరిగిన పోటీలకు శాంతినికేతన్‌, సెయింట్‌ జోసెఫ్‌, శ్రీ సాయి ఒలంపియాడ్‌, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సైంటిఫిటర్‌, లిటిల్‌ ఏజెంట్స్‌ మొదలకు పాఠశాల చెందిన135 విద్యార్థులు పోటీలో పాల్గొన్నారు. న్యాయ నిర్ణయి తలుగా ఉపాధ్యాయులు జీవనజ్యోతి, రామారావు, సిహెచ్‌ రమేష ఉన్నారు.