
ప్రజాశక్తి - పాలకొల్లు రూరల్
లంకలకోడేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ భాషా గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు జిబిజె.ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన, వకృత్వ, కవితలు, పద్యాలు, చిత్రలేఖనం, వ్యాకరణాంశాలపై పోటీలు నిర్వహించారు. విజేతలకు పాఠశాల హిందీ ఉపాధ్యాయులు గొల్ల జనార్దన్‌రావు, డి.మహేష్, కె.భాగ్యశ్రీ బహుమతులు అందజేశారు. అనంతరం పాఠశాల హెచ్‌ఎంను ఘనంగా సత్కరించారు.
గణపవరం : కొమ్మర ప్రాథమికోన్నత పాఠశాలలో హిందీ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కటకం సుందరకుమార్ మాట్లాడారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి.సౌజన్య. ఎల్.ప్రసాదరావు, జి.పార్వతి పాల్గొన్నారు.
పెనుగొండ : పెనుగొండ శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో హిందీ దివస్ సందర్భంగా గురువారం పాఠశాలలో వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు వివిధ రాష్ట్రాల సంప్రదాయాలను ప్రతిబింబించే వస్త్ర ధారణతో జాతీయతను చాటిచెప్పారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ బి.సత్యనారాయణ మాట్లాడారు. అనంతరం వ్యాసరచన, హిందీ కవితల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు.
పాలకొల్లు : పాలకొల్లు మాంటిస్సోరి స్కూల్లో హిందీ భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం హిందీ భాషాభివృద్ధికి తోడ్పడిన కవులు, రచయితలు, సాహిత్యకారులకు జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా అమలాపురానికి చెందిన హిందీ అధ్యాపకుడు సత్యనారాయణ మాట్లాడారు. హిందీ ప్రపంచంలోనే అత్యంత మధురమైన భాష అని తెలిపారు. తేలికగా నేర్చుకునే భాష అని తెలిపారు. అనంతరం విద్యార్థులకు నిర్వహించిన వకృత్వ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ కెవి కృష్ణవర్మ, ప్రిన్సిపల్ ఎస్‌పిఎస్ ప్రకాష్‌రావు పాల్గొన్నారు. అలాగే ఎవిఎస్ మున్సిపల్ హైస్కూల్లో హిందీ భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పాఠశాల హెచ్‌ఎం ఆర్.విష్ణుమూర్తి హిందీ ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం వ్యాసరచన, డిబెట్, పాటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే హిందీ పండిట్స్ సిహెచ్.సరస్వతి, బిఎం.రాజేశ్వరీని సత్కరించారు. ఎఎస్‌ఎన్‌ఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హిందీ భాషా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని హిందీ అధ్యాపకులు ఎఎస్‌ఎస్ రమణ కుమార్ నిర్వహించారు.