Apr 05,2023 00:06
వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

ప్రజాశక్తి-అద్దంకి: ఈ నెల 14వ తేదీన డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఫూలే అంబేద్కర్‌ జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో నియోజకవర్గం స్థాయిలో కళాశాల, హైస్కూల్‌ విద్యార్థులకు వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలు అద్దంకి పట్టణంలోని ప్రకాశం బార్సు హైస్కూల్‌లో జరిగాయి. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు అంకం కిరణ్‌ మాట్లాడుతూ విద్యార్థులకు జాతీయ నాయకులపట్ల వారి జీవిత చరిత్ర పట్ల ఆసక్తి కలిగించడం కోసం పోటీలు ఉపయోగపడతాయని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్బయ్య పోటీ పరీక్షను ప్రారంభించి విద్యార్థులకు ఆశీస్సులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికి బహుమతులు అందిచడం సంతోష కరం అన్నారు. పోటీలో దాదాపు 300 విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. వీరందరికి ఏప్రిల్‌ 14న అంబేద్కర్‌ విగ్రహం వద్ద జరిగే వేడుకలలో బహుమతులు అందించనున్నారు. శాంసన్‌, గంగాధర్‌, పూర్ణ న్యాయ నిర్ణీతలుగా వ్యవహారించారు. ఈ కార్యక్రమంలో బిల్లా అంకమ్మరావు, రాజశేఖర్‌, సోనీ,నాగయ్య, వికాస్‌, కొంగల శ్రీనివాసరావు, రామారావు, బాబురావు, వీరాంజనేయులు, హరికృష్ణ, శ్రీను, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.