ప్రజాశక్తి - పరవాడ
విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా ఉక్కు నగరం పవర్ గ్రిడ్ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం పరవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను పవర్ గ్రిడ్ మేనేజర్ జి.వెంకటేశ్వరరావు ప్రారంభించారు. కలాశాలలో, 11, 12 తరగతులు చదువుతున్న 55 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ప్రథమ బహుమతి పి.హర్షిత, ద్వితీయ బహుమతి ఎన్.ప్రవీణ, తృతీయ బహుమతి డి.నవీన్, నాలుగో బహుమతి ఎ.దివ్య సాధించారు. జి.ప్రియ, పి.భూమిక, ఎస్.స్వేత ప్రోత్సాహక బహుమతులు గెలుచుకున్నారు. వారోత్సవాలు సందర్భంగా కళాశాల విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ లెక్చరర్ లలితా కుమారి, పవర్ గ్రిడ్ విద్యుత్ సంస్థ ఉద్యోగులు గౌరీశంకరావు , దేవి వర ప్రసాద, పైల అప్పారావు, ఉమా శంకర్, మహేష్, అప్రెంటీస్‌లు ప్రియాంక, అపూర్వ, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.










