ప్రజాశక్తి-అద్దంకి: పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కమిటీశ్వర స్వామి దేవస్థానంలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షా ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అభినందన సభ జరిగింది. నగదు ప్రోత్సాహక బహుమతులను పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పొన్నాపల్లి బ్రహ్మానందం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అందజేశారు. అత్యధిక మార్కులు సాధించిన హరికృష్ణ, నాగదుర్గ, అభిలాష్, సిద్దు, ధరణి, లక్ష్మి, అడుగుల చంద్రశేఖర ఆచారి, సౌగంధికలను అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ ప్రతి ఏడాది విద్యార్థులకు సంఘ సహకారం ఉంటుందన్నారు. ముఖ్యఅతిథిగా జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసాచారి పాల్గొని మాట్లాడుతూ సంఘం అభివృద్ధి చెందాలంటే విద్యాపరంగానే సాధ్యమన్నారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారన్నారు. ఈ కార్యక్రమంలో నరసింహాచారి, చింతలపూడి వీరయ్య, హరిబాబు, దేవరకొండ నాగేశ్వరరావు, బహునాథం, నాగచారి, సుబ్బారావు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.










